BHPL: మహదేవపూర్ మండలం కుదురుపల్లి అటవీ ప్రాంత సమీపంలో కుక్కల దాడిలో గురువారం చుక్కల జింక మృతిచెందింది. అటవీ ప్రాంతం నుంచి వచ్చిన జింకపై మూడు కుక్కలు దాడి చేయగా, స్థానికులు దానిని రక్షించి అటవీ శాఖకు అప్పగించారు. పశువైద్యుడితో చికిత్స అందించినప్పటికీ జింక ప్రాణాలు దక్కలేదు. అనంతరం అటవీ ప్రాంతంలో ఖననం చేసినట్లు అటవీ క్షేత్రాధికారి రవి తెలిపారు.
తెలంగాణ
కుక్కల దాడిలో చుక్కల జింక మృతి


