హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెద్దపులి దాడిలో బర్రె దూడ మృతి

MNCL: సిర్పూర్ (టి) మండలంలో పెద్దపులి దాడి కలకలం రేపింది. గురువారం మండలంలోని చీలపల్లికి చెందిన గొడ్ల మల్లు బర్రె దూడ మేత కోసం ఇటుకలపహాడ్ అటవీ ప్రాంతానికి వెళ్లగా పులి దాడి చేసింది. ఈ దాడిలో దూడ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు.