హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ అంతరాయాల పరిష్కారానికి మొబైల్ డీటీఆర్‌లు

SRCL: విద్యుత్ సరఫరా అంతరాయాలను వేగంగా పరిష్కరించేందుకు రెండు మొబైల్ డీటీఆర్ ట్రాలీలను అందుబాటులోకి తెచ్చారు.160 కేవీఏ సామర్థ్యం గల డీటీఆర్‌లతో రూపొందించిన ట్రాలీలను NPDCL ఇన్‌చార్జ్ ఎస్ఈ రవీందర్ సిరిసిల్ల సర్కిల్ కార్యాలయంలో ప్రారంభించారు. అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ పునరుద్ధరణను త్వరితగతిన చేపట్టి వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యమని ఆయన తెలిపారు.