హైదరాబాద్: 28°C
తెలంగాణ

648 కిలోల నల్లబెల్లం,10 కిలోల పటిక సీజ్‌

BDK: నిషేధిత సారాయి తయారీకి వినియోగించే నల్లబెల్లం, పటికను అక్రమంగా తరలిస్తున్న మారుతీ సుజుకి వ్యాన్‌ను టేకులపల్లి పోలీసులు గురువారం పట్టుకున్నారు. తనిఖీల్లో వ్యాన్‌లో తరలిస్తున్న 648 కిలోల నల్లబెల్లం, 10 కిలోల పటికను స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్‌ చేశారు. డ్రైవర్‌ గూగులోత్‌ కుమార్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు.