హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంధకారంలో కవ్వాల్ గ్రామం

MNCL: జన్నారం మండలం కవ్వాల్ గ్రామంలో వీధిలైట్లు లేక రాత్రివేళ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రహదారి వెంట విద్యుత్ స్తంభాలకు బల్బులు ఏర్పాటు చేయాలని అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆరోపించారు. చీకట్లో రాకపోకలు సాగించాలంటే పాములు, తేళ్ల భయం వెంటాడుతోందన్నారు. అధికారులు వెంటనే వీధిలైట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.