KNR: వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో అర్హులైన పేద కుటుంబాలకు గురువారం ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాపర్తి సంధ్య, రవి, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
పోతిరెడ్డిపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ


