KMM: భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం సత్తుపల్లి మండలం నారాయణపురంలో రీ సర్వేపై రైతులతో ముఖాముఖి నిర్వహించారు. బేతుపల్లిలో 6 వేల ఎకరాల రీ సర్వే పూర్తయిందన్నారు. అభ్యంతరాల స్వీకరణ తర్వాతే భూధార్ కార్డులు ఇస్తామని ఆయన తెలిపారు. రైతుల ఇబ్బందులను దూరం చేయాడానికే రీ సర్వే నిర్వహించినట్లు వెల్లడించారు.
తెలంగాణ
భూ భారతితో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం: మంత్రి


