WNP: చిన్నంబావి మండల అభివృద్ధికి రూ.4 కోట్ల నిధులు విడుదల చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.మండలంలో పర్యటించిన మంత్రి చిన్న మారూర్ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల చేశారు. నీరు అందుబాటులోకి రావడంతో రైతులకు సాగునీటి ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా నీటి సరఫరాపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
తెలంగాణ
చిన్నంబావి అభివృద్ధికి రూ.4 కోట్లు: మంత్రి


