SRPT: కల్మల్‌చెరువు పీహెచ్‌సీని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పెండెం వెంకటరమణ గురువారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వైద్య సేవలు, సిబ్బంది పనితీరును పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. వానాకాలం నేపథ్యంలో మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు.
తెలంగాణ
'సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి'


