హైదరాబాద్: 28°C
తెలంగాణ

బంకాపురం రోడ్డుకు మోక్షమెప్పుడో..?

NLG: నిడమనూరు మండలంలోని బంకాపురం రోడ్డు రెండేళ్లుగా అసంపూర్తిగా ఉండడంతో బంకాపురం, వెనిగండ్ల, సూరేపల్లి గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చెక్‌పోస్టు నుంచి వెనిగండ్ల వరకు రూ.3.5 కోట్లతో 5.1 కి.మీ. రోడ్డు నిర్మాణానికి ఏడాది క్రితమే కంకర పనులు పూర్తయినా బీటీ వేయలేదు. ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి బీటీ పనులు పూర్తి చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.