HYD: కేపీహెచ్‌బీ ఫేజ్ 1, 2 రోడ్లలోని పలు హాస్టళ్లలో గురువారం పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హాస్టల్ నిర్వాహకులు, యువతకు , గంజాయి, డ్రగ్స్ వాడకం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద లింకులు, కాల్స్‌కు స్పందించవద్దని, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని సూచించారు.
తెలంగాణ
కేపీహెచ్‌బీ హాస్టళ్లపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు


