హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 25న గురుకులలో స్పాట్ ప్రవేశాలు

కామారెడ్డి జిల్లాలోని 11 తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో మిగిలిన ఖాళీల భర్తీకి ఈనెల 25న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు డీసీవో శివరాం తెలిపారు. 5 నుంచి 9వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం (ఎంపీసీ, బైపీసీ) ప్రవేశాలకు బాలురకు బిక్కనూర్, బాలికలకు తాడ్వాయి గురుకులాల్లో ఉదయం 9 గంటలకు కౌన్సెలింగ్ ఉంటుందన్నారు.