హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుండెపోటుతో మహిళ మృతి..!

MHBD: కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పలుస మౌనిక (35) గుండెపోటుతో గురువారం సాయంత్రం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మిరప తోటలో పని చేస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు. వెంటనే కేసముద్రంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో మహబూబాబాద్‌కు తరలిస్తుండగా మృతి చెందింది.