WGL: ఎల్కతుర్తి మండల కేంద్రంలో కారులో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. 2 రోజులుగా గుర్తుతెలియని వ్యక్తులు కారును అక్కడే వదిలివెళ్లారు. కారు నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు తనిఖీ చేయగా మూటకట్టిన మృతదేహాన్ని గుర్తించారు. నడిరోడ్డుపై కారులో మృతదేహాన్ని వదిలివెళ్లడం స్థానికంగా సంచలనంగా మారింది.
తెలంగాణ
VIDEO: కారులో మృతదేహం లభ్యం


