KNR: నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యకు నిరసనగా నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు సాగిన ఈ ర్యాలీలో ప్రైవేట్ పాఠశాలల ఛైర్మన్లు, ప్రిన్సిపళ్లు, ఉపాధ్యాయులు, పీఈటీలు పాల్గొన్నారు. రూపారెడ్డి ఆత్మశాంతి కోసం నివాళులర్పించి, నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు.
తెలంగాణ
ప్రిన్సిపల్ హత్యకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ


