హైదరాబాద్: 28°C
తెలంగాణ

అగ్నిప్రమాదంలో ఊపిరాడక వ్యక్తి మృతి

NZB: నిజామాబాద్‌ నగరంలోని ముజాహిద్‌నగర్‌లో ఓ ఇంట్లో గురువారం రాత్రి ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగింది. మంటల తీవ్రతకు ఇంట్లో ఉన్న ఇశ్రాత్‌ అహ్మద్‌(40) బయటకు రాలేక మరో గదిలో ఊపిరాడక మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్‌ SHO రఘుపతి తెలిపారు.