హైదరాబాద్: 28°C
క్రైమ్

గేదెల దాడిలో యువకుడి మృతి

TG: గేదెల దాడిలో యువకుడు మృతిచెందిన ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. అంతారం గేటు వద్ద గేదెలు రోడ్డు దాటుతుండగా దుర్గాప్రసాద్ అనే యువకుడు బైక్‌పై వెళ్లాడు. ఈ క్రమంలో గేదెలు అతడిపై దాడిచేశాయి. ఓ గేదె పొడవడంతో దుర్గాప్రసాద్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటనలో మరో వ్యక్తికి తీవ్రగాయాలు కాగా, అతడి పరిస్థితి విషమంగా ఉంది. దుర్గాప్రసాద్ స్వస్థలం కిష్టాపూర్‌గా గుర్తించారు.