హైదరాబాద్: 28°C
క్రైమ్

రూ.500 కోసం తండ్రిని చంపిన కుమారుడు

TG: సంగారెడ్డిలోని జహీరాబాద్ అల్లిపూర్‌లో దారుణం జరిగింది. రూ.500 కోసం తండ్రిని కుమారుడు హత్య చేశాడు. రూ.500 తీసుకున్నాడంటూ తండ్రి శంకర్‌పై అనుమానం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే తండ్రిని తుకారాం కత్తితో పొడిచి గొంతుకోసి చంపేశాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.