హైదరాబాద్: 28°C
వ్యాపారం

వచ్చే రెండేళ్లలో 1000 ఉద్యోగాలు: ఫినోమ్

అంతర్జాతీయ HR టెక్నాలజీ సంస్థ ఫినోమ్‌.. వచ్చే రెండేళ్లలో భారత్‌లో 1,000 మంది నిపుణులను నియమించుకుంటామని తెలిపింది. ప్రస్తుతం ఫినోమ్‌.. HYD, VSP, బెంగళూరులో ఆఫీసులను నిర్వహిస్తోంది. ఇక్కడ 1,000కి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. HR సేవలకు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో.. వచ్చే రెండేళ్లలో కొత్తగా మరో 1,000 మంది నిపుణులను నియమించుకోవాలని చూస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.