హైదరాబాద్: 28°C
వ్యాపారం

గోల్డ్ లోన్స్ వ్యాపారంలోకి ఆదిత్య బిర్లా

ఆదిత్య బిర్లా క్యాపిటల్ గోల్డ్ లోన్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టనుంది. వచ్చే మూడేళ్లలో 1,000 శాఖలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2027 చివరికి తొలిదశలో 300 శాఖలు ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది. దేశంలో బంగారు రుణాలు మంచి వృద్ధిని నమోదుచేస్తున్నాయని అందుకే ఈ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు సంస్థ తెలిపింది. పట్టణాల్లో, నగరాల్లో మార్కెట్‌ను విస్తరిస్తామని పేర్కొంది.