హైదరాబాద్: 28°C
క్రీడలు

SL vs IND: కొలంబో వేదికగా రెండో టెస్టు

భారత్, శ్రీలంక మధ్య రెండో టెస్టు ఈనెల 23న ఉ.10 గంటలకు ప్రారంభం కానుంది. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో గెలిచిన భారత్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. దీంతో రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్‌ను క్లిన్‌స్వీప్ చేయాలని భావిస్తోంది. ధ్రువ్ జురెల్ గాయంతో ఈ టెస్టుకు అందుబాటులో ఉండటంపై సందిగ్ధత నెలకొంది.