హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేన లెజిస్లేటర్ సమావేశంలో ఎమ్మెల్యే

VSP: శాసనసభలోని ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరిగిన జనసేన పార్టీ లెజిస్లేటర్ సమావేశంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల మీద లోతుగా చర్చించారు. అలాగే, స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసైనికుల పోరాట స్ఫూర్తిని కొనసాగించేలా ముందుకు సాగాలని పవన్ కళ్యాణ్ సూచించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.