హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉపాధి పనులకు హామీ

AKP: రావికమతం మండలం బుడ్డిబంద ఆదివాసీల ఆందోళనకు స్పందించిన ఉపాధి హామీ అధికారులు గురువారం గ్రామాన్ని సందర్శించారు. ఉపాధి పనులు కల్పించక ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు అధికారులకు తెలిపారు. స్పందించిన ఏపీవో చిన్నారావు శుక్రవారం నుంచి జీడిమామిడి, కొబ్బరి మొక్కలకు గుంతలు తవ్వే పనులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు శాంతించారు.