హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాబ్ మేళాలో 18 మంది ఎంపిక

కోనసీమ: మంత్రి వాసంశెట్టి సుభాష్, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామచంద్రపురంలో నిర్వహించిన 47వ జాబ్ మేళాలో 18 మంది యువత ఉద్యోగాలకు ఎంపికయ్యారు. డిక్సన్ కంపెనీకి 15 మంది, నియో లింక్‌కు ముగ్గురు ఎంపికయ్యారు. ఎంపికైన వారికి ఫౌండేషన్ ఛైర్మన్ సత్యం నియామక పత్రాలు అందజేశారు. జాబ్ మేళాలను నిరంతరం కొనసాగిస్తామని సత్యం తెలిపారు.