హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

40 మంది కార్మికులకు వెట్టిచాకిరీ నుంచి విముక్తి

సత్యసాయి: కొత్తచెరువు, గోరంట్ల బొగ్గు భట్టీల్లో చిక్కుకున్న మహారాష్ట్రకు చెందిన 40 మంది కార్మికులకు అధికారులు విముక్తి కల్పించారు. కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశాలతో రంగంలోకి దిగిన బృందాలు దాడులు చేశాయి. బాధితులకు రిలీజ్ సర్టిఫికెట్లు ఇచ్చి, అక్రమ రుణాలు రద్దు చేశారు. తక్షణ సాయం, వైద్యం అందించి స్వరాష్ట్రానికి పంపారు. బాధ్యులపై కేసులు నమోదు చేశారు.