హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఎస్పీ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీసులు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని, ప్రమాదాల నివారణకు ప్రయాణికులు, డ్రైవర్లు పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.