హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వరలక్ష్మి వ్రతంతో నగల దుకాణాలకు కళ

WG: వరలక్ష్మి వ్రతం సందర్భంగా నరసాపురంలోని నగల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. పూజల కోసం మహిళలు బంగారు, వెండి వస్తువులు కొనుగోలు చేసేందుకు భారీగా తరలివచ్చారు. అమ్మవారి అలంకరణ, కలశంపై ఉంచేందుకు అర గ్రాము నుంచి లభించే బంగారు రూపులకు డిమాండ్ పెరిగింది. దీంతో మహిళలు వాటిని ఎక్కువగా కొనుగోలు చేశారు.