హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రేషన్ పంపిణీలో పారదర్శకత పాటించాలి'

SKLM: లబ్ధిదారులకు రేషన్ సరుకులు సక్రమంగా అందేలా డీలర్లు బాధ్యతగా వ్యవహరించాలని తహసీల్దార్ ఎన్.రమేష్‌కుమార్ సూచించారు. కంచిలి తహసీల్దార్ కార్యాలయంలో గురువారం రేషన్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సకాలంలో పంపిణీ చేయాలని, అవకతవకలకు తావివ్వొద్దని ఆదేశించారు. లబ్ధిదారుల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని తెలిపారు.