హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కిడ్నీ బాధిత విద్యార్థికి ఆర్థిక సహాయం

AKP: నర్సీపట్నం పాతభయపురెడ్డిపాలెం ఎంపీపీ పాఠశాల పాత విద్యార్థి వైరాల నవీన్ కుమార్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. అతని చికిత్స నిమిత్తం గురువారం డివిజన్ PRTU ఉపాధ్యాయులు స్పందించి, బాధితుడి తల్లిదండ్రులు రాము, సునీతలకు రూ.75 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఇందులో PRTU ఉపాధ్యాయులు రూ.65 వేలు సమకూర్చగా, ఎంపీపీ స్కూల్ టీచర్లు జివి.రమేష్, శాంతాదేవి రూ.10 వేలు ఇచ్చారు.