హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పేద వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి'

KKD: కూటమి ప్రభుత్వం పేద వర్గాల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తోందని కాకినాడ సిటీ నియోజకవర్గ పరిశీలకులు పెచ్చెట్టి చంద్రమౌళి అన్నారు. ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం కాకినాడ 18వ డివిజన్‌లో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.