WGL: గీసుగొండ మండలం ఊకల్ శివారు భారత్ పెట్రోల్ బంకులో రూ.15,800 చోరీ చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాజీపేటకు చెందిన కంది చరణ్, జక్కుల ప్రతాప్, గండికోట శివలను మరియాపురం వద్ద వాహన తనిఖీల్లో పట్టుకున్నారు. వారి నుంచి రూ.11 వేల నగదు, రెండు సెల్‌ఫోన్లు, ఆటో స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ CI పంపించినట్లు తెలిపారు.
తెలంగాణ
పెట్రోల్ బంకులో చోరీ.. ముగ్గురి అరెస్ట్


