హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పెద్ది విగ్రహాన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి'

MLG: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ములుగు జిల్లా అధ్యక్షుడు పోరిక గోవింద్ నాయక్ గురువారం వెంకటాపూర్‌లో మాట్లాడుతూ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ప్రభుత్వమే బేషరతుగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విగ్రహం ధ్వంసం చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ప్రభుత్వం విగ్రహాన్ని ఏర్పాటు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు.