హైదరాబాద్: 28°C
తెలంగాణ

కులగణనతోనే బీసీలకు న్యాయం: శ్రీనివాస్ గౌడ్

HYD: బీసీల హక్కుల సాధనకు శాస్త్రీయ కులగణన అత్యంత అవసరమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో 80 కోట్ల మంది బీసీలు ఉన్నప్పటికీ కులాల వారీగా స్పష్టమైన గణాంకాలు లేకపోవడంతో వెనుకబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.