హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జేసీ

ASR: సీఎం చంద్రబాబు అరకు పర్యటన నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ శ్రీపూజ గురువారం గన్నెల, అమలగూడ గ్రామాల్లో పర్యటించారు. సీఎం పర్యటనకు అనుగుణంగా భద్రతా ప్రమాణాల మేరకు హెలిప్యాడ్ నిర్మాణానికి అనువైన స్థలాలను ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ, పోలీస్, మండలస్థాయి అధికారులతో పరిశీలించారు. పర్యటనకు సంబంధించిన లాజిస్టిక్స్, ప్రోటోకాల్, భద్రతా ఏర్పాట్లను పక్కాగా చేపట్టాలన్నారు.