హైదరాబాద్: 28°C
వార్తలు

శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు

BHPL: శ్రావణమాస శుక్రవారం సందర్భంగా రేగొండ మండలంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఉదయం 9 గంటలకు సామూహిక కుంకుమార్చన నిర్వహించనున్నారు. భక్తులు ముందుగా రసీదు తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్నం 12 గంటలకు గజవాహన సేవపై అమ్మవారి ఊరేగింపు, అనంతరం నివేదన, ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు.