హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రహదారి నిబంధనలు పాటించాలి'

ASR: చింతపల్లి కందులుగాది జంక్షన్‌ వద్ద గురువారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనదారులకు డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించి, హెల్మెట్లు, వాహన రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్సై వీరబాబు మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపకుండా, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలన్నారు.