హైదరాబాద్: 28°C
తెలంగాణ

MGU-IITH భాగస్వామ్యంతో కొత్త అవకాశాలు

NLG: అంతర్విషయక అధ్యయనాలు, సంయుక్త పరిశోధనలతో విద్యార్థులు, పరిశోధకులకు మెరుగైన అవకాశాలు కల్పించవచ్చని ఐఐటీ హైదరాబాద్ అకాడమిక్ డీన్ ఆచార్య అశోక్‌కుమార్ పాండే అన్నారు. విద్య, పరిశోధనా రంగాల్లో సహకారంపై ఎంజీయూ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. వివిధ కోర్సులు, పరిశోధనలు, ఐచ్ఛిక అంశాలను ఐఐటీ హైదరాబాద్ విభాగాలతో కలిసి నిర్వహించే అవకాశాలపై చర్చించారు.