GNTR: తెనాలి పురపాలక సంఘంలో వార్డుల సంఖ్యను 40 నుంచి 52కు పెంచుతూ.. ప్రభుత్వం ఆమోదించిన డిలిమిటేషన్ ఉత్తర్వులు గెజిట్ నం.33లో ఆగస్టు 19న ప్రచురితమయ్యాయి. గెజిట్ ప్రతులను గురువారం ప్రజల పరిశీలనార్థం మున్సిపల్ కార్యాలయ నోటీసు బోర్డులో కమిషనర్ జే. రామ అప్పలనాయుడు ఉంచారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ పీ. శ్రీకాంత్, మేనేజర్ విల్సన్ జయకర్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య పెంపు


