హైదరాబాద్: 28°C
తెలంగాణ

వీధి దీపాలు, ఐమాక్స్ లైట్ల ఏర్పాటు

NZB: డిచ్పల్లి మండలం సుద్దులం గ్రామంలో ఈరోజు సర్పంచ్ శ్రీమతి తినేటి హేమలత లక్ష్మణ్ ఆధ్వర్యంలో గ్రామంలో వీధి దీపాలు, ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజలకు మెరుగైన వెలుతురు, రాత్రి వేళల్లో సురక్షిత రాకపోకలు కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు. గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యమని సర్పంచ్ హేమలత లక్ష్మణ పేర్కొన్నారు.