హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయవాడలో YCP జెండా దిమ్మ ధ్వంసం

NTR: విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 5వ డివిజన్‌ LIC కాలనీలో YCP జెండా దిమ్మను అర్ధరాత్రి ధ్వంసం చేయడంపై ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఘటన స్థలాన్ని పరిశీలించి, బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం పేరుతో రాజకీయ కక్షలు సహించబోమని హెచ్చరించారు.