హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బ్రిక్స్ సమావేశాల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

విశాఖలో ఈ నెల 22, 23వ తేదీల్లో జరగనున్న బ్రిక్స్ దేశాల యువజన, క్రీడా మంత్రుల సమావేశాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ పరిశీలించారు. సీపీ శంఖబ్రత బాగ్చి, శాప్ ఎండీ భరణితో కలిసి వేదికలు, భద్రత, అతిథుల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. సమావేశాలు విజయవంతంగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.