హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజమండ్రిలో విద్యార్థుల నిరసన ర్యాలీ

E.G: ప్రశ్నపత్రాల లీకేజీలు, అవకతవకలకు కారణమైన NTAను రద్దు చేసి పారదర్శక పరీక్షా వ్యవస్థను తేవాలని AISF జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్ డిమాండ్ చేశారు. రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ధవళేశ్వరం వరకు గురువారం AISF ర్యాలీ నిర్వహించింది. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు.