హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు ములకలపల్లిలో పర్యటించనున్న ఎమ్మెల్యే

BDK: ములకలపల్లి మండలంలో ఇవాళ (శుక్రవారం) ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటించనున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. పొగళ్లపల్లి, తిమ్మంపేట గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు వారు తెలిపారు. కావున మండలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాల్లో పాల్గొని పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.