హైదరాబాద్: 28°C
వార్తలు

కలెక్టర్‌కు ఆటో యూనియన్ వినతి

MBNR: ఈనెల 24వ తేదీన జిల్లా కేంద్రంలో ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో నిర్వహించబోయే బంద్‌కు అధికార యంత్రాంగం సహకరించాలని ఆటో యూనియన్ల నాయకులు కోరారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తాకు గురువారం కలెక్టరేట్లో వినతి పత్రం సమర్పించారు. ఆటో డ్రైవర్లకు ఇస్తామన్న 12 వేల హామీని ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. ఆటో యూనియన్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు