హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సామర్లకోటలో వార్డుల పునర్విభజన గెజిట్ ప్రదర్శన

KKD: సామర్లకోట మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజనకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా 31 వార్డులను 36గా విభజించేందుకు ప్రతిపాదనలకు ఆమోదం లభించినట్లు కమిషనర్ ఎన్. కనకారావు తెలిపారు. గెజిట్ ప్రతులను సచివాలయాలు, తహశీల్దార్, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉంచారు.