హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాలువలో పడి వ్యక్తి మృతి

నెల్లూరు మూలపేటలోని రామయ్య బడి సమీప కాలువలో పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. మద్యం మత్తులో కాలువలో పడిపోయి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, ఘటనపై దర్యాప్తు చేపట్టారు.