హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మైనర్ డ్రైవింగ్ పోలీసుల ఉక్కుపాదం

KRNL: కల్లూరులో మైనర్ డ్రైవింగ్‌పై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. గురువారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి చైతన్య కళాశాల సమీపంలో బైక్లు నడుపుతున్న సుమారు 20 మంది ఇంటర్ విద్యార్థుల వాహనాలను సీజ్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులు, వాహన యజమానులపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.