హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మునేశ్వరమ్మ కుటుంబం గొప్ప దాతృత్వం

ATP: నార్పల గ్రామానికి చెందిన మునేశ్వరమ్మ కన్నుమూశారు. తీవ్ర దుఃఖంలోనూ భర్త లక్ష్మిరెడ్డి, కుమారుడు గణేష్, అన్న నాగేశ్వర్ రెడ్డి నేత్రదానానికి ముందుకొచ్చారు. అనంతపురం రెడ్ క్రాస్ ప్రతినిధులు నేత్రాలను సేకరించారు. మరణానంతర నేత్రదానంపై ఆసక్తి ఉన్నవారు 9440839043 నంబర్‌లో సంప్రదించాలని రెడ్ క్రాస్ ప్రతినిధులు కోరారు.