BHPL: భూపాలపల్లి, మహదేవపూర్ ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత, 18–35 ఏళ్ల వయస్సు ఉండాలన్నారు. ఈ నెల 21 నుంచి సెప్టెంబర్ 2 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వివరాలకు WDCW తెలంగాణ వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.
తెలంగాణ
అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం


