హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ధర్మవరంలో అటల్ స్మారక క్రికెట్ టోర్నీ ప్రారంభం

సత్యసాయి: ధర్మవరం ఆర్డీటీ గ్రౌండ్‌లో అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారక క్రికెట్ టోర్నమెంట్ సీజన్-3 గురువారం ప్రారంభమైంది. ఆర్డీవో రాంభూపాల్ రెడ్డి, డీఎస్పీ జగన్నాథ్ రాజు, హరీష్ బాబు టోర్నీని ప్రారంభించారు. తొలి మ్యాచ్‌లో రైజింగ్ స్టార్‌పై డ్రాగన్ XI, రెండో మ్యాచ్‌లో జై శ్రీరామ్ జై హనుమాన్‌పై స్టార్ XI జట్లు విజయం సాధించాయి. యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.